భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోన్న హీరోయిన్ రష్మిక

భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోన్న హీరోయిన్ రష్మిక

0
91

దేశంలో కరోనా పాజిటీవ్ కేసులు దారుణంగా పెరుగుతున్నాయి, ఈ సమయంలో అన్నీ పరిశ్రమలు కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి, ఉపాధి వ్యాపారాలు లేక చాలా మంది అవస్తలు పడుతున్నారు.ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానంలో ఉంది భారత్, ముఖ్యంగా సినిమా ధియేటర్లు ఓపెన్ అవ్వడం లేదు, అంతేకాదు చిత్ర షూటింగులు కూడా ఎక్కడా జరగడం లేదు.

అయితే చాలా సినిమాలు రిలీజ్ కాకుండా ఆగిపోయాయి. ఈ సమయంలో హీరోయిన్స్ రెమ్యునరేషన్ పెంచడమంటే మామూలు విషయం కాదు… చాలా మంది హీరోలు స్టోరీలు వింటున్నా, వెంటనే ఒకే చేయడం లేదు. ఈ కరోనా సమయంలో రెమ్యునరేషన్ భారీగా తగ్గించి ఇస్తున్నారు, అందుకే స్టోరీ పక్కన పెడుతున్నారు.

అయితే హీరోయిన్లు కూడా కొందరు ఒకే చెబుతుంటే డిమాండ్ ఉన్నహీరోయిన్లు మాత్రం రెమ్యునరేషన్ తగ్గించడం లేదు.. హీరోయిన్ రష్మిక మాత్రం తన పారితోషికం విషయంలో తగ్గేది లేదంటోంది.టాలీవుడ్ లో ప్రస్తుతం రష్మిక మందన్నక్రేజీ హీరోయిన్ . ఎందుకంటే ఈ ఏడాదిలో సరిలేరు నీకెవ్వరు భీష్మ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ దక్కించుకుంది. కేవలం స్టార్ హీరోల సినిమాలకే ఒకే చెబుతోంది, అలాగే రెమ్యునరేషన్ మాత్రం ఎక్కడా తగ్గించడం లేదట.