బీబీ3 లో విల‌న్ గా అతని పేరు సూచించిన బాలయ్య

బీబీ3 లో విల‌న్ గా అతని పేరు సూచించిన బాలయ్య

0
128

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో మూడో సినిమా రాబోతోంది, ఇప్పటికే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు అందరూ… బీబీ3 వర్కింగ్ టైటిల్మూవీ తెరకెక్కుతోంది.
ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది..

ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ నటిని తీసుకోనున్నారు, అయితే ముందు సంజయ్ దత్ విలన్ గా పేరు వినిపించింది, అయితే భారీ రెమ్యునరేషన్ కారణంగా వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది చిత్ర యూనిట్ , ఈ సమయంలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

వివేక్ ఒబెరాయ్ పేరును బాలకృష్ణనే బోయపాటికి సూచించాడని వార్తలు వినిపిస్తున్నాయి.. వివేక్ ఒబెరాయ్ ఇప్పటికే బోయపాటి శ్రీను-రాంచరణ్ కాంబినేషన్లో వచ్చిన వినయ విధేయ రామ చిత్రంలో విలన్గా చేశారు. సో మరోసారి ఆయనని తీసుకుంటారా లేదా మరో వ్యక్తిని చూస్తారా అనేది చూడాలి, టాలీవుడ్ లో ఈ వార్త ఇప్పుడు బాగా వినిపిస్తోంది.