Flash- చైసామ్‌ విడాకులపై కంగనా సంచలన వ్యాఖ్యలు

Beatown Queen shocking comments on Chaisam divorce ..!

0
93

టాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ నాగచైతన్య-సమంత విడాకులు తీసుకోవడంపై బీటౌన్‌ క్వీన్‌ కంగనా రనౌత్  షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ బంధం విఫలమైతే దానికి మగాడే పూర్తి బాధ్యత అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె సామ్‌-చైల రిలేషన్‌ గురించి కొన్ని షాకింగ్‌ కామెంట్స్‌ చేస్తూ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు.

ఏ జంట విడాకులు తీసుకున్నా..దానికి మూల కారణం పురుషుడే. వినడానికి ఇది ఒక తీర్పులా అనిపించినా..ఇందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే దేవుడు స్త్రీ, పురుషులను అలాగే సృష్టించాడు. విడాకుల సంస్కృతి రోజురోజుకీ బాగా పెరిగిపోతుందని కంగనా పేర్కొన్నారు.

అలాగే విడాకుల గురించి ప్రస్తావిస్తూ..కంగన ఓ బాలీవుడ్‌ నటుడిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘నాలుగేళ్ల వివాహబంధానికి స్వస్తి చెబుతూ తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు టాలీవుడ్‌ నటుడు ప్రకటించాడు. పెళ్లి కంటే ముందు ఆయన తన సతీమణితో 10 సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్నాడు.

ఇటీవల ఆ నటుడు విడాకుల నిపుణుడైన బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ని కలిశారు. ఇప్పుడు ఆయన మార్గదర్శకత్వంలోనే ఇదంతా జరిగింది. నేను ఎవ్వరి గురించి చెబుతున్నానో అందరికీ అర్థమయ్యే ఉంటుంది’ అని ఆమె పోస్ట్‌లు పెట్టారు.