Sridevi Sarees Auction: ఆల్చిప్పల్లాంటి కళ్లతో మత్తుగా మాయ చేసినా.. మానవా అంటూ అమాయకంగా చూసినా.. జాము రాతిరి జాబిలమ్మా అంటూ పాట పాడినా ఆమె అందం, అభినయం కళ్లముందు ఉంటుంది. ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేసి, ఇక సెలవ్ అంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన అతిలోక సుందరి శ్రీదేవి చీరలను వేలం వేయటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీదేవి నటించిన ఇంగ్లీష్-వింగ్లీష్ చిత్రంలో ఆమె ధరించిన చీరలను వేలం వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 1980లో హీరోయిన్‌గా అడుగుపెట్టి, తెలుగు,తమళం, హిందీ అంటూ.. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా స్టార్ హీరోయిన్‌గా శ్రీదేవి ఎదిగారు.