Sridevi Sarees Auction: వేలానికి అతిలోక సుందరి చీరలు

-

Sridevi Sarees Auction: ఆల్చిప్పల్లాంటి కళ్లతో మత్తుగా మాయ చేసినా.. మానవా అంటూ అమాయకంగా చూసినా.. జాము రాతిరి జాబిలమ్మా అంటూ పాట పాడినా ఆమె అందం, అభినయం కళ్లముందు ఉంటుంది. ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేసి, ఇక సెలవ్‌ అంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన అతిలోక సుందరి శ్రీదేవి చీరలను వేలం వేయటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీదేవి నటించిన ఇంగ్లీష్‌-వింగ్లీష్‌ చిత్రంలో ఆమె ధరించిన చీరలను వేలం వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 1980లో హీరోయిన్‌గా అడుగుపెట్టి, తెలుగు,తమళం, హిందీ అంటూ.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ అనే తేడా లేకుండా స్టార్‌ హీరోయిన్‌గా శ్రీదేవి ఎదిగారు.

లెజండరీ యాక్టింగ్‌ చేసి, తన స్థానాన్ని ప్రేక్షకుల మదిలో పదిలం చేసుకున్నారు. 1997లో వివాహ బంధంలో అడుపెట్టి, నటనకు బ్రేక్‌ ఇచ్చారు. సుధీర్ఘ విరామం తరువాత 2012లో ఇంగ్లీష్‌-వింగ్లీష్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అక్టోబర్‌ 10న విడుదల అయ్యింది. ఈ సినమా విడుదలయ్యి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేకంగా జరుపుకునేందుకు ఆ చిత్ర దర్శకులు గౌరీ షిండే ప్లాన్‌ చేస్తున్నారు. ఆ సినిమాలో శ్రీదేవి ధరించిన చీరలను వేలం వేసి.. వచ్చిన డబ్బుతో బాలికల విద్య కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వనున్నారు.

Read Also: రావి ఆకుపై దీపం వెలిగిస్తే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహిళను కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని...

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...