బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలో ఆ ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలో ఆ ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు

0
95

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టాలీవుడ్ లో మంచి సూపర్ హిట్ విజయాలు అందుకున్నాడు. చేసినవి కొన్ని సినిమాలే అయినా అందులో సక్సెస్ రేటు ఎక్కువ.. నిర్మాతలకు పెద్దగా నష్టాలు రాలేదు అనే చెప్పాలి, అయితే ఆయన సినిమాలు హిందీలో డబ్ అవుతూ ఉంటాయి, యాక్షన్ కథాంశాలకు బాగాసెట్ అవుతారు సాయి శ్రీనివాస్, ఇక హిందీలో కూడా ఆయన సినిమాలు లక్షల మంది చూస్తు ఉంటారు, మొత్తానికి తాజాగా ఆయన హీరోగా హిందీలో చత్రపతి సినిమా రీమేక్ అవ్వబోతుందట.

ఈ సినిమా బాధ్యతలు సుజీత్ కు అప్పగించినట్లు తెలుస్తోంది, దర్శకుడు సుజీత్ ఈ సినిమా పనిలో బిజీగా ఉన్నారు అని తెలుస్తోంది, ఇక మంచి మార్కెట్ హిందీలో ఆయనకు ఉండటంతో అందాల ముద్దుగుమ్మలను బిజీ హీరోయిన్లను ఈ సినిమాలో తీసుకుంటున్నారట.

తాజాగా స్టార్ హీరోయిన్స్ సారా అలీ ఖాన్ అనన్య పాండేలు ఈ చిత్రంలో నటించబోతున్నారని టాక్ వినిపిస్తోంది, టాలీవుడ్ లో మొత్తానికి చాలా బిజీగా ఉండే ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఇప్పుడు శ్రీనుతో కలిసి నటించబోతున్నారట, ఇక వచ్చే నెల దీనిపై కీలక ప్రకటన రానుందట. టాలీవుడ్ లో ఛత్రపతి ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే, అదే హిట్ బాలీవుడ్ లో సాయి శ్రీనివాస్ కు వస్తుంది అని ఆశిద్దాం.