బెల్లంకొండ ‘ఛత్రపతి’ హిందీ మూవీ ట్రైలర్ విడుదల

-

Chatrapathi Trailer |యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘ఛత్రపతి’. 2005వ సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రంతో ప్రభాస్ ఇమేజ్ వేరే లెవల్ కి వెళ్లింది. మన తెలుగు హీరో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sreenivas) బాలీవుడ్ చిత్రపరిశ్రమకు ఇప్పుడీ ఈ చిత్రం హిందీ రిమేక్ ద్వారానే పరిచయమవుతున్నాడు. ప్రముఖ తెలుగు దర్శకుడు వీవీ వినాయక్ దీనికి దర్శకత్వం వహించాడు. ఛత్రపతి పేరుతోనే తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్(Chatrapathi Trailer ) తాజాగా విడుదలైంది. తెలుగు సినిమాలో శ్రీలంక నుంచి వచ్చిన వలస కూలీగా ప్రభాస్ కనపడితే.. ఇందులో పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వాడిగా హీరోను చూపించారు. పెన్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాలో నుష్రత్(Nushrratt Bharuccha) హీరోయిన్ గా నటించగా, సీనియర్ నటి భాగ్యశ్రీ హీరో తల్లి పాత్రను పోషించింది. మే 12వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా బెల్లంకొండను హిందీ పరిశ్రమలో మంచి హీరోగా నిలబెడుతుందో లేదో వేచిచూడాలి.

- Advertisement -
Read Also: మహిళల మానసిక ఒత్తిడి తగ్గించే 3 సులువైన చిట్కాలు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...