‘గిప్పడి సంది ఖేల్ అలగ్’.. ‘భగవంత్ కేసరి’గా బాలయ్య

-

Bhagavanth Kesari |నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) వరుస చిత్రాలతో అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటికే అఖండ, వీరసింహా రెడ్డి చిత్రాలతో వరుస బ్లాక్‌బాస్టర్ హిట్స్ కొట్టి ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఈ జోష్‌లోనే సక్సెస్‌ఫుల్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ‘NBK 108’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పేరును బాలయ్య పుట్టినరోజు పురస్కరించుకుని రివీల్ చేశారు. దర్శకుడు అనిల్ ఈ చిత్రానికి ‘భగవంత్ కేసరి(Bhagavanth Kesari)’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు చెబుతూ ‘గిప్పడి సంది ఖేల్ అలగ్’ అనే క్యాప్షన్‌ను జత చేస్తూ ట్వీట్ చేశాడు. ఇక సినిమాలో కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీ లీల బాలయ్య కూతరు పాత్రలో నటిస్తోంది. టైటిట్ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. కాగా 2023 దసరా కానుకగా ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది.

- Advertisement -

Read Also:
1. తిరుమలలో హీరోయిన్‌కు ఓం రౌత్ ముద్దులు.. మండిపడుతున్న హిందూ సంఘాలు
2. ఎసిడిటీ బాధిస్తుందా.. పరగడుపునే ఈ ఆకుల్ని నమలండి
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...