టాలీవుడ్ నటుడు నిర్మాత బండ్ల గణేష్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు, అంతేకాదు పలు సూపర్ హిట్ సినిమాలు నిర్మాతగా తీశారు ఆయన, అయితే కెరీర్ స్టార్టింగ్ లో చిన్నచిన్న పాత్రలు చేసిన ఆయన ఇప్పుడు నిర్మాతగా మారి పది మందికి అవకాశాలు ఇచ్చే స్టేజ్ కు వెళ్లారు అనే చెప్పాలి.
పరమేశ్వరీ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి పవన్ కళ్యాణ్ – రవితేజ – ఎన్టీఆర్ – అల్లు అర్జున్ మొదలైన స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించాడు. 2015లో వచ్చిన టెంపర్ ఆయన చివరి సారిగా తీసిన సినిమా తర్వాత మళ్లీ సినిమా రాలేదు, ఐదు సంవత్సరాలు అయింది ఆయన నిర్మాణం చేసి.
అయితే ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఓ క్యారెక్టర్ చేశారు ఆయన … ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఇక ఆయనతో ఓ సినిమా ఉంటుంది అని తెలిసింది, అయితే మరో ఇద్దరు మెగా హీరోలతో సినిమాలు చేయాలి అని చూస్తున్నారట.మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ లతో చిత్రాలు చేయాలి అని చూస్తున్నారట
ఇప్పటికే దర్శకుల వేటలో ఉన్నాడట బండ్ల గణేష్.