భారతీయుడు 2 చిత్ర షూటింగ్ లో విషాదం శంకర్ కు షాక్

భారతీయుడు 2 చిత్ర షూటింగ్ లో విషాదం శంకర్ కు షాక్

0
100

భారతీయుడు 2 సినిమాని దర్శకుడు శంకర్ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు, ఇందులో కమల్ హసన్ లీడ్ రోల్ చేస్తున్నారు, అలాగే సిద్ధార్థ, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్సింగ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. . శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రయూనిట్ కు పెద్ద షాక్ తగిలింది.

భారతీయుడు-2 సెట్స్లో ఘోర ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. సంతోషంగా చిత్ర యూనిట్ షూటింగ్ చేస్తుంటే ఈ ప్రమాదం వారిని కలిచివేసింది. దీంతో ఆ కుటుంబాలతో పాటు కోలీవుడ్ చిత్ర పరిశ్రమ కూడా కన్నీరు మున్నీరు అవుతోంది.

చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతుండగా నిన్న రాత్రి 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్ ప్రమాదవశాత్తు తెగి కింది ఉన్న టెంట్పై పడింది. ఈ ఘటనలో టెంట్ కింద ఉన్న వారిలో శంకర్ వ్యక్తిగత సహాయకుడు మధు, అసిస్టెంట్ డైరెక్టర్ సాయికృష్ణ, సహాయకుడు చంద్రన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఆ టెంట్ దగ్గర ఉన్న మరో 10మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.. వెంటనే చిత్ర యూనిట్ వారిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ,వారు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారట.