మళ్లీ సెట్స్ పైకి ‘భారతీయుడు-2’..ఆ వివాదం ముగిసినట్టేనా?

'Bharatiyudu-2' on the sets again .. Is that the end of the controversy?

0
81

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇండియన్‌ 2’. ఈ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌, శంకర్‌ మధ్య తలెత్తిన సమస్యల కారణంగా ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. ఈ వివాదం కోర్టు వరకూ వెళ్లింది. ఎట్టకేలకు శంకర్‌, చిత్ర నిర్మాణ సంస్థ మధ్య చర్చలు సఫలం అయినట్టు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్టు చిత్రబృందం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

రామ్‌చరణ్‌తో తీస్తున్న చిత్రంతో పాటు, ‘అన్నియన్‌’ హిందీ రీమేక్‌ను శంకర్‌ తెరకెక్కించడానికి కూడా లైకా ప్రొడక్షన్‌ అభ్యంతరం పెట్టకుండా ఒప్పుకొన్నట్టు తెలుస్తోంది. మ‌రి ఈ సినిమాల త‌ర్వాత వాటిని పూర్తి చేస్తాడా, లేకుంటే వీటిని చేసుకుంటూ ఆ మూవీని పూర్తి చేస్తాడా అన్న‌ది చూడాలి. ఇండియ‌న్ 2లో క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

కాగా గతంలో ‘భారతీయుడు-2’ షూటింగ్​ స్పాట్​లో జరిగిన ప్రమాదంలో చిత్రబృందంలోని ముగ్గురు సభ్యులు మరణించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఆర్థిక సాయం ప్రకటించాడు కమల్. ఇది కేవలం సహాయం మాత్రమేనని, ముందుముందు ఇలాంటివి జరగకుండా చూస్తామని చెప్పాడు. ఇది తన బాధ్యతే కాదని, చిత్ర పరిశ్రమకు చెందిన ఇతర సెలబ్రిటీలు సాయం చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.