‘ఆర్​ఆర్​ఆర్’​ నుంచి ‘భీమ్’​ కొత్త లుక్ రిలీజ్..ట్రైలర్​ వచ్చేది ఎప్పుడంటే?

'Bheem' new look release from 'RRR'..when will the trailer come out?

0
110

ఎన్టీఆర్​, రామ్​చరణ్​ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా ‘ఆర్​ఆర్​ఆర్’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమాల వేగాన్ని పెంచారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, గ్లింప్స్​, ‘దోస్తీ’, ‘నాటు నాటు’, ‘జనని’ పాటలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీలో ఎన్టీఆర్ పోషించిన కొమురం​ భీమ్​ పాత్రకు సంబంధించిన కొత్త పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. అల్లూరిసీతరామరాజుగా నటించిన రామ్​చరణ్​కు సంబంధించిన​ కొత్త పోస్టర్​ను నేడు సాయంత్రం 4 గంటలకు రిలీజ్​ చేయనున్నట్లు ప్రకటించింది. డిసెంబరు 9న ఈ చిత్ర ట్రైలర్​ను విడుదల చేయనున్నట్లు మరోసారి గుర్తు చేసింది.

ఆలియాభట్‌ , ఒలీవియా మోరీస్‌ కథానాయికలు. శ్రియ, సముద్రఖని, అజయ్‌ దేవ్‌గణ్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మించారు. కీరవాణి స్వరాలు అందించారు.