భీమవరంలో త్రివిక్రమ్ కొత్త బిజినెస్ ?

(భీమవరంలో త్రివిక్రమ్ కొత్త బిజినెస్ ? )

0
94

గోదావరి జిల్లాల నుంచి చాలా మంది సినిమా ప్రముఖులు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు.. వారిలో చాలా మంది పశ్చిమగోదావరి జిల్లా నుంచి అని చెప్పాలి ..మెగాస్టార్, అల్లు కుటుంబం, త్రివిక్రమ్, సునీల్, రవితేజ, ప్రుద్వీ, దాసరి నారాయణరావు, బాపు, ఈవీవీ, వివి వినాయక్, ఇలా చెప్పుకుంటే చాలా మంది ఉన్నారు

అయితే సినిమాల్లో చాలా ఫేమ్ సంపాదించుకుని, మంచి పొజిషన్లో ఉన్న వారు ఉన్నారు, వారు తమ ప్రాంతంలో సొంతంగా యూనిక్ గా ఏదైనా చేయాలి అని అనుకుంటారు… తాజాగా పలు సినిమా ధియేటర్స్ షాపింగ్ కాంప్లెక్స్ లు మల్టీ ప్లెక్స్ లు నిర్మిస్తున్న వారు ఉన్నారు.. పలు సినిమా ధియేటర్లు కూడా నిర్మించిన వారు ఉన్నారు. సక్సెస్ ఫుల్ గా నడుపుతున్న వారు ఉన్నారు.

తాజాగా డవలప్ మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న భీమవరంలో, దర్శకుడు త్రివిక్రమ్ సినిమా ధియేటర్ ప్లాన్ చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి , తన సొంత ప్రాంతంలో సినిమా ధియేటర్ ప్లాన్ చేస్తున్నారట.. మరి ఈ వార్త ఎంత వరకూ నిజమో చూడాలి.. ఆరు నుంచి 7 స్క్రీన్లతో పెద్ద మల్టిప్లెక్స్ మరో ఇద్దరితో ఆయన ప్లాన్ చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి.