భీష్మ వసూళ్లు తొలిరోజు ఎంతో తెలిస్తే మతిపోతుంది

భీష్మ వసూళ్లు తొలిరోజు ఎంతో తెలిస్తే మతిపోతుంది

0
85

మంచి టైమ్ లో నితిన్ సినిమా భీష్మ విడుదల అయింది.. పెద్ద స్టార్ హీరోల సినిమాలు ఏవీ ఈ వారంలో లేవు.. దీంతో భీష్మకు పోటీ లేకుండా పోయింది.. అంతేకాదు సినిమా కథ బాగుండటంతో స్టోరీ లైన్ నచ్చడంతో చాలా మంది ఈ చిత్రం చూసేందుకు ఆసక్తి చూపించారు.. తొలిరోజు శివరాత్రి కావడంతో సినిమా హళ్లు జనంతో నిండిపోయాయి.

నితిన్ – రష్మిక జంట ప్రేక్షకుల నుంచి మంచి మార్కులను కొట్టేసింది. తెలుగురాష్ట్రాల్లో తొలి రోజున ఈ సినిమా 6.4 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 2.21కోట్ల షేర్ ను రాబట్టింది. ఇది నితిన్ కు మంచి వసూళ్లు అనే చెప్పాలి, ఇక నితిన్ గతంలో నటించిన అఆ చిత్రం తర్వాత ఇదే అంత పెద్దస్ధాయి వసూళ్లు సాధించింది.

ఇక ఈ సినిమా తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది.. రివ్యూలు అదిరిపోయాయి.. దీంతో భీష్మకు తిరుగులేకుండా పోయింది. ఈ రోజు .. రేపు వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక చాలా కాలంగా సక్సెస్ లేకుండా ఉన్న నితిన్ కు ఇది మంచి సక్సెస్ అందించింది. మొత్తానికి ఈ సినిమాకి వచ్చే వారం వరకూ భారీ వసూళ్లు ఉంటాయి అంటున్నారు అభిమానులు.