భీష్మ టైటిల్ పై రగడ చిత్ర యూనిట్ కు బీజేపీ షాక్

భీష్మ టైటిల్ పై రగడ చిత్ర యూనిట్ కు బీజేపీ షాక్

0
92

టాలీవుడ్ లో సినిమా టైటిల్స్ పై కథలపై వివాదాలు ఏనాటి నుంచో ఉన్నాయి, అయితే టాలీవుడ్ కు ఇదేమీ కొత్త కాదు.. ఎప్పటి నుంచో నెలకోసారి అయినా టైటిల్ కి కథలకి రైట్స్ మావి అని వచ్చేవారు చాలా మంది ఉన్నారు.. కేసుల వరకూ వెళ్లి కోర్టుల చుట్టు తిరిగేవారు చాలా మంది ఉన్నారు.

ఆ మధ్య వరుణ్ తేజ్ హీరోగా నటించిన వాల్మీకి టైటిల్ పై బోయ వాల్మీకిలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చివరికి దర్శకుడు హరీష్ శంకర్ వాల్మీకి టైటిల్ కి బదులుగా గద్దలకొండ గణేష్ అని మార్చారు… ఇక తాజాగా ఇప్పుడు మరో సినిమాకి చిక్కులు వచ్చాయి.

నితిన్-రష్మిక జంటగా నటించిన భీష్మ టైటిల్ పై రగడ మొదలైంది. భీష్మ పేరుతో సినిమా తెరకెక్కించడంపై బీజీపీ ధార్మిక సెల్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. భీష్ముడు మహాభారతానికి మూల పురుషుడు..ఆ జన్మ బ్రహ్మచర్యం పాటించిన వాడు. అలాంటి గొప్ప వ్యక్తి పేరుతో సినిమా తెరకెక్కించి విడుదల చేయడం కుదరదని అంటున్నారు, దీని టైటిల్ మార్చాలి అని లేకపోతే విడుదల ఆపుతాం అని చెబుతున్నారు. అయితే బీష్ముడ్ని లవర్ బాయ్ గా ఎలా చెబుతాం , మరి ఇలా మీ ఇష్టానుసారం కథలు రాస్తారా అని విమర్శలు చేస్తున్నారు.