“భీమ్లా నాయక్” ఫ్రీ రిలీజ్ ఈవెంట్..గెస్ట్ ఎవరో తెలుసా?

"Bhimla Nayak" Free Release Event..Do you know who the guest is?

0
103

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, హీరో రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా మూవీ భీమ్లా నాయక్‌. మలయాళంలో హిట్ కొట్టిన అయ్యప్పనుమ్ కోషీయం సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా నిత్యామీనన్ రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ను చిత్రబృందం పంచుకుంది.

భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25వ తారీఖున థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిత్రబృందం భారీ ప్లాన్ చేస్తోంది.

అయితే ఈ ఈవెంట్ కు ఓ స్పెషల్ గెస్ట్ ను ఈ ఈవెంట్ కు  రప్పించాలని చిత్రబృందం భావిస్తోందట. ఇందులో భాగంగానే మంత్రి కేటీఆర్.. స్పెషల్ గెస్ట్ గా ఫైనల్ చేసింది చిత్ర బృందం. అయితే దీనిపై కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన కూడా చేసింది. ఫిబ్రవరి 21వ తేదీన హైదరాబాదులోని ఓ ప్రముఖ కన్వెన్షన్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనుంది.