‘భీమ్లానాయక్’ ఫ్యాన్స్‌కు పండగే..తాజా పోస్టర్ చూశారా?

'Bhimlanayak' is a festival for fans ..

0
91

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం భీమ్లానాయక్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. భీమ్లానాయక్ సినిమాలో మరో హీరోగా దగ్గుబాటి యంగ్ హీరో రానా నటిస్తున్న విషయం తెలిసిందే. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు రాస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్స్, పాటలు సినిమా పై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే చాలా సినిమాలు సంక్రాంతి బరిలో పోటీపడనున్నాయి. దాంతో కొన్ని సినిమాలు వెనక్కి తగ్గాయి. తమ రిలీజ్ డేట్స్‌ను వాయిదా వేసుకున్నాయి. ఈ నేపథ్యంలో భీమ్లానాయక్ సినిమా కూడా వాయిదా పడనుందని వార్తలు పుట్టుకొచ్చాయి.

ఈ వార్తలకు చిత్రయూనిట్ చెక్ పెట్టేసింది. తాజాగా రిలీజీ డేట్‌తో ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. అనుకున్న తేదీకే భీమ్లానాయక్ సినిమా థియేటర్స్ లో సందడి చేయనుంది. జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.