గుమ్మడికాయ కొట్టేసిన భీమ్లానాయక్ టీం..ఆ వార్తలకు చెక్ పెట్టేసినట్టేనా?

Bhimlanayak team hit the pumpkin .. Did you check the news?

0
108

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న సినిమా భీమ్లానాయక్. మళయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రచన సహకారం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం అటు పవన్ అభిమానులు, రానా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్స్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. జనవరి 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్ నటిస్తుండగా..

తాజాగా భీమ్లానాయక్ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేశారని తెలుస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు పూర్తి కాకపోవడంతో విడుదల వాయిదా పడే ఛాన్స్ ఉందని కొందరు సోషల్ మీడియాలో గుసగుసలాడారు.. అయితే ఆ వార్తలకు ఇప్పుడు చెక్ పడ్డట్టే.. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా.. హీరోల స్టార్ డమ్ దృష్టిలో పెట్టుకొని మార్పులు చేర్పులు చేశారని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.