Bhola Shankar | మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘భోళా శంకర్‌’ టీజర్ అప్‌డేట్

-

మెగాస్టార్ చిరంజీవి అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ‘భోళా శంకర్(Bhola Shankar)’. ఈ సినిమాను మెహెర్ రమేశ్‌ తెరకెక్కిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా(Tamanna) ఫీ మేల్‌ లీడ్ రోల్‌ పోషిస్తుండగా.. చిరంజీవి సోదరి పాత్రలో కీర్తిసురేశ్‌(Keerthy Suresh) నటిస్తోంది. ఇప్పటికే చిరంజీవి టీం ఏదో ఒక అప్‌డేట్‌తో ఫ్యాన్స్ లో జోష్‌ నింపుతున్న విషయం తెలిసిందే. తాజాగా భోళాశంకర్ టీజర్ అప్‌డేట్ అందించారు మేకర్స్‌. ఈ మూవీ టీజర్‌ను జూన్ 24న లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించారు. చిరు స్టైలిష్‌ లుక్‌లో ఉన్న టీజర్‌ అప్‌డేట్‌ పోస్టర్‌ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. తమిళ బ్లాక్ బస్టర్‌ వేదాళమ్‌ రీమేక్‌గా ఈ సినిమా వస్తోంది. ఇటీవలే హైదరాబాద్‌లో వేసిన స్పెషల్ సెట్‌లో తమన్నా, చిరు, కీర్తిసురేశ్‌తోపాటు ఇతర నటీనటులందరిపై సంగీత్‌ సెర్మనీ నేపథ్యంలో వచ్చే సాంగ్‌ను షూట్‌ చేశారు. శేఖర్‌ వీజే కొరియోగ్రఫీ చేస్తున్న ఈ పాట షూటింగ్‌కు సంబంధించిన విజువల్స్‌ ను కూడా చిరంజీవి షేర్ చేశాడు. భోళా శంకర్(Bhola Shankar) ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

- Advertisement -
Read Also:
1. ఉత్కంఠంగా హీరో నిఖిల్ ‘స్పై’ ట్రైలర్

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...