గత సీజన్ లో నర్మదగా మోనాల్ – మరి ఇప్పుడు ఎవరంటే ?

Big boos season 5 show updates

0
98

బిగ్ బాస్ రియాలిటీ షో కోసం కోట్లాది మంది ఎదురుచూశారు. ఈసారి తెలుగులో సీజన్ 5 నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. అయితే తొలిరోజు ఆట ఎలా ఉంటుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈసారి చాలా మంది తెలియని వారే వచ్చారు గత సీజన్ ని మించి పోయేలా ఈ సీజన్ ఉంటుంది అంటున్నారు అందరూ. సినిమాల్లో కనిపించే సెలబ్రిటీలు నిజ జీవితంలో ఎలా ఉంటారు.? వారి భావోద్వేగాలు ఎలా ఉంటాయో ఇక్కడ తెలుసుకోవచ్చు. అందుకే ఇది అంత పాపులర్ షో అయింది.

ఇక్కడ గొడవలు, తిట్టుకోవడాలు, పోట్లాటలు, ప్రేమలు, ఆప్యాయతలు, మళ్లీ కలిసిపోవడం స్నేహం భావోద్వేగాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. బాగా ఎమోషన్ అయిన వారు ఉంటారు. అయితే గత సీజన్ లో
మోనల్ గజ్జర్ ఎప్పుడూ ఏడుస్తూ కనిపించేంది. ఈ కారణంగానే ఆమెకు నెటిజన్లు నర్మద అని పేరు కూడా పెట్టారు.
నర్మదా నదిలా ఆమె కన్నీరు ప్రవహిస్తుందని ఫన్నీగా కామెంట్లు చేసేవారు.

మరి ఈసారి ఎవరు ఆమెలా ఇలా బాగా ఎమోషన్ అవుతున్నారు అంటే ? అప్పుడే ఒక రోజుకే ఓ వ్యక్తిని ఫిక్స్ అయ్యారు.
ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తమకు నచ్చని కంటెస్టెంట్ల ఫొటోలను చెత్తలో పడమేయని బిగ్బాస్ టాస్క్ ఇచ్చారు.
ఈ సమయంలో కొందరు ఎమోషనల్ అయ్యారు. ఎక్కువగా హమీదా బాగా ఎమోషన్ అయినట్లు కనిపించింది. హమీదా కంటతడి పెట్టుకుంది. చూడాలి మరి ఒకరోజుకే ఆమెని ఇలా ఫిక్స్ అవ్వలేము కదా అని అంటున్నారు ఇంకొందరు.