బిగ్ బాస్ డేట్ వచ్చింది – మరి టైమ్ మారిందేమిటి ? బుల్లితెర టాక్ ఇదే

Big boss 5 reality show date announced

0
97

బిగ్ బాస్ అభిమానులకి ఇది నిజంగా కిక్ ఇచ్చే వార్త. బిగ్ బాస్ ఐదో సీజన్ ఓపెనింగ్ ఎపిసోడ్ సెప్టెంబరు 5న సాయంత్రం 6 గంటల నుంచి ప్రసారం అవుతుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి10 గంటల నుంచి ప్రసారం అవుతుంది, ఇక వీకెండ్స్ శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటల నుంచి ప్రసారం అవుతుందని తెలిపింది స్టార్ మా.

ప్రేక్షకులకి ఇక మంచి వినోదం ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు బిగ్ బాస్ టీమ్. అయితే ఈసారి టైమ్ మారడంపై చాలా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సీరియల్స్ పలు షోలు ఉండటం వల్ల ఈ సమయం కుదరలేదు అని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే 10 గంట‌ల టైమ్ స్లాట్ నిర్ణ‌యించార‌ట‌.

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్లు వీరే అంటూ చాలా మంది పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి వారు ఎవరు అనేది చూద్దాం. యాంకర్ వర్షిణి, నవ్య, లహరి, కార్తీకదీపం సీరియల్ భాగ్యం (ఉమా), యాంకర్ రవి, ఆట కొరియోగ్రాఫర్ సందీప్ , జ్యోతి, యానీ మాస్టర్, యూట్యూబర్లు షణ్ముఖ్ జశ్వంత్, నిఖిల్, నటి ప్రియ, ఆర్జే కాజల్, లోబో, వీజే సన్నీ వీరి పేర్లు వినిపిస్తున్నాయి. మరి చూడాలి సెప్టెంబర్ 5న ఎవరు హౌస్ లో ఉంటారో తేలిపోతుంది.