బిగ్ బాస్- అఖిల్ సార్ధక్ రియల్ లైఫ్ స్టోరీ

బిగ్ బాస్- అఖిల్ సార్ధక్ రియల్ లైఫ్ స్టోరీ

0
147

అఖిల్ సార్ధక్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు, అయితే హౌస్ లో అందరిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.. మరి ఆయన వెండితెరపై బుల్లితెరపై కూడా నటించాడు, సినిమాలు సీరియల్స్ ద్వారా తన నటన నిరూపించుకున్నాడు.

2014లో బావ మరదల్లు సినిమాలో విలన్ గా నటించాడు…. అఖిల్ నవంబర్ 17- 1995- న హైదరాబాద్ లో జన్మించాడు, వాళ్ల అమ్మ నాన్న హైదరాబాద్ లో ఉంటారు, చిన్న తనం నుంచి నటన అంటే అతనికి చాలా ఇష్టం, దాంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

హైదరాబాద్ లో సిల్వర్ హౌస్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆయన పది వరకూ చదువుకున్నారు, తర్వాత
హైదరాబాద్ యూనివర్సిటీలో గ్రాడ్యువేషన్ పూర్తి చేశారు, మోడలింగ్ – ఫ్యాషన్ అంటే అతనికి చాలా ఇష్టం, తర్వాత ఆయన సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాలు చేశారు, ఇక తర్వాత సీరియల్స్ లో అవకాశాలు రావడంతో సీరియల్స్ చేస్తున్నారు.ముత్యాల ముగ్గు, ఎవరే నువ్వు, కల్యాణి ,మోహినీ అనే సీరియల్స్ లో నటించాడు…..అఖిల్ కు జిమ్ అంటే ఇష్టం, అలాగే బాడీ ఫిట్ నెస్ పై ఆశక్తి చూపిస్తాడు, ఇక తను హౌస్ లో గంగవ్వని బాగా చూసుకోవడం అందరిని నచ్చింది.