బిగ్ బాస్ 4 నుంచి నోయల్ అనారోగ్య సమస్యలతో బయటకు వచ్చారు, అయితే ఆయన కోలుకుని మళ్లీ తిరిగి హౌస్ లోకి రావాలి అని బిగ్ బాస్ కూడా ఆశించారు, అయితే ఆయన అనారోగ్యం కారణంగా హౌస్ లో ఉండలేకపోయాడు.. నోయెల్ అభిమానులు కూడా షాక్ అయ్యారు.
గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు నోయల్… అందుకే టాస్కుల్లో కూడా సరిగ్గా ఆడటం లేదు. మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్కు షిఫ్ట్ చేయాలని భావించి ఆయనని బయటకు తీసుకువచ్చారు..తన లగేజీని కూడా తీసుకువెళ్లాడు నోయల్, అయితే నోయల్ మళ్లీ ఇంటికి వస్తాడా లేదా అనే అనుమానం అభిమానుల్లో ఉంది.
అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇప్పుడు కరోనా సమయం, ఈ సమయంలో ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నా అక్కడ మళ్లీ కరోనా పరీక్షలు చేసి క్వారంటైన్ లో ఉంచి హౌస్ లోకి తీసుకురావాలి, అయితే ఇవన్నీ జరిగే అవకాశం ఉందా అనే అనుమానాలు కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వారంలో క్యూర్ అవ్వకపోతే ఇక బిగ్ బాస్ ఇంటికి నోయల్ పూర్తిగా గుడ్ బై చెప్పినట్లే అంటున్నారు.