ఈ వారం బిగ్ బాస్ హౌస్ ను వీడింది దివి, అయితే అనూహ్యాంగా ఆమె ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది, దీంతో ఆమె అభిమానులు షాక్ అయ్యారు, అంతేకాదు దివి కచ్చితంగా చివరి వరకూ ఉంటుంది అని అనుకున్నారు కాని అంతా రివర్స్ అయింది, అయితే దివి హౌస్ నుంచి బయటకు వచ్చినా ఆమె ఫేమ్ మరింత పెరిగింది, మహర్షి సినిమాతో ఆమె మంచి పేరు సంపాదించింది.. ఇప్పుడు బిగ్ బాస్ లో తనకు తాను ఎలా ఉంటానో అలా ఉండి ఫేమ్ సంపాదించుకుంది.
ఆమె అందానికి ఆమె డ్యాన్స్ కి కచ్చితంగా చాలా మంది ఆమెకి సినిమా అవకాశాలు రావాలి అని కోరుకుటున్నారు, తాజాగా దివితో సినిమా చేయాలి అని చాలా మంది చూస్తున్నారు, ఇప్పటికే ఇద్దరు టాప్ దర్శకులు దివికి తమ సినిమాలో అవకాశాలు ఇవ్వాలి అని చూస్తున్నారట.
అయితే హౌస్ నుంచి బయటకు వచ్చిన దివికి ఇప్పుడు సూపర్ సక్సెస్ సినిమాలు వస్తాయి అంటున్నారు చాలా మంది అభిమానులు.. ఆమెకి సినిమా అవకాశాలు ఇవ్వాలి అని దర్శకులు డిసైడ్ అయ్యారు. సో దీంతో దివి అభిమానులు చాలా ఆనందంలో ఉన్నారు..