Flash: బాలీవుడ్​ నటుడు సోనూసూద్​కు బిగ్ షాక్!

0
101

బాలీవుడ్​ నటుడు సోనూసూద్​కు చేదు అనుభవం ఎదురైంది. పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​లో ఓ పోలింగ్​ బూత్​ను పరిశీలించేందుకు ప్రయత్నించగా ఆయన్ను అధికారులు అడ్డుకున్నారు. ఆయన కారును సీజ్ చేసి, బయటకు రావద్దని ఈసీ వార్నింగ్ ఇచ్చింది.

“విపక్షాలు, ముఖ్యంగా అకాలీ దళ్​కు చెందిన వారి నుంచి పలు పోలింగ్​ కేంద్రాల్లో ఓటర్లకు బెదిరింపులు వచ్చినట్లు తెలిసింది. కొన్ని కేంద్రాల్లో డబ్బులు పంచుతున్నారు. అలాంటి ప్రాంతాలకు వెళ్లి తనిఖీ చేయటం, ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడటం మన బాధ్యత. అందుకోసమే ఇంటి నుంచి బయటకు వచ్చాము. ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నాం అని సోనూసూద్ తెలిపారు.