‘RRR’ నుండి బిగ్ సర్ ప్రైజ్..అదిరిపోయే ఆంథమ్ సాంగ్ వచ్చేది ఆరోజే!

0
98

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కేసులు పెరగడంతో సినిమాను వాయిదా వేశారు మేకర్స్. దీంతో మెగా నందమూరి అభిమానులు నిరాశకు గురయ్యారు. అదే సమయంలో మార్చి 25న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు మేకర్స్.

అయితే సినిమా రిలీజ్ కు ముందు ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ ఇవ్వనుంది ఆర్ఆర్‌ఆర్ టీం. ఈనెల 14న ట్రిపుల్ ఆర్ సెలబ్రేషన్ ఆంథమ్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈనెల 25న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రంపై మరింత హైప్ పెంచేందుకు సెలబ్రేషన్ ఆంథమ్ సాంగ్ ను విడుదల చేయనుంది. దీనికి సంబంధించి పోస్టర్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్ ముగ్గురు కూడా మెస్మరైజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పిక్స్ చూస్తేఅర్ధమవుతుంది.

తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో ఈనెల 25న థియేటర్లకు రాబోతోంది. ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి. సరికొత్త రికార్డులను సాధిస్తుందనే నమ్మకం ఉంది. బాహుబలి తరువాత దర్శకధీరుడు రాజమౌళి తీస్తున్న సినిమా కావడంతో హైప్ క్రియేట్ అయింది.  ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి నుంచి వచ్చే మరో పాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’చారిత్రక నేపథ్య కథతో భారీ స్థాయిలో సినిమాను నిర్మించారు. ఎన్టీఆర్ కొమురంభీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తున్నారు. వీరిద్దరికి జోడీగా ఒలివియా మోరిస్, బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. ప్రత్యేక పాత్రలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్ గన్ కనిపిస్తున్నారు.