Breaking News: మా ఎన్నికల్లో బిగ్‌ ట్విస్ట్‌..!

0
96

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నటుడు సీవీఎల్ నరసింహారావు పోటీ నుంచి తప్పుకున్నారు. కాసేపటి క్రితమే మేనిఫెస్టో ప్రకటించిన ఆయన అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మా అధ్యక్ష పదవికి వేసిన నామినేషన్‌ను ఆయన ఉపసంహరించుకున్నారు.

తనకు అధ్యక్ష పదవి కంటే మా సభ్యుల సంక్షేమమే ముఖ్యమని అన్నారు. అయితే  ఎన్నికల్లో పోటీ చేయకపోయినా తను ప్రకటించిన మేనిఫెస్టో అమలు అయ్యేందుకు చూస్తానని సీవీఎల్‌ పేర్కొన్నారు. ఇప్పుడు పోటీలో ఉన్న రెండు ప్యానెల్స్‌లో ఎవరికీ మద్ధతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. కాగా నిన్న బండ్లగణేశ్‌ సైతం ‘మా’ జనరల్ సెక్రెటరీ పదవికి వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మేడ్ పోటీ నెలకొనడంతో ‘మా’ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.