“కేజీఎఫ్-2” నుండి బిగ్ అప్డేట్..ట్రైలర్ రిలీజ్ కు ముహుర్తం ఫిక్స్!

0
119

కేజీఎఫ్‌ – 1 ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా రికార్డులు తిరగరాసింది. ఒక రకంగా చెప్పాలంటే సినీ ప్రపంచంలో ఓ ట్రెండ్‌ సెట్‌ చేసింది కేజీఎప్‌ -1. తాజాగా కన్నడ స్టార్​ హీరో నటించిన ‘కేజీఎఫ్​ 2’ చిత్రం నుంచి మరో కొత్త అప్డేట్​ వచ్చింది.

కేజీఎఫ్‌ 2 ట్రైలర్‌ కు ముహుర్తం ఖరారు చేస్తూ..అప్డేట్‌ ఇచ్చింది చిత్ర బృందం. మార్చి 27 వ తేదీన సాయంత్రం 6.47 గంటలకు కేజీఎఫ్‌ 2 మూవీ ట్రైలర్‌ ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ పవర్‌ ఫుల్‌ పోస్టర్‌ కూడా విడుదల చేసింది చిత్ర బృందం.

కేజీఎఫ్ అనుకున్న‌దానికంటే రెట్టింపు విజ‌యాన్ని సాధించడంతో కేజీఎఫ్2 అత్యంత భారీగా తెరకెక్కించారు. సీక్వెల్ అనౌన్స్ చేసిన‌ప్ప‌టినుంచే యావ‌త్ భార‌త సినీ ప్రేక్ష‌కులు పార్ట్-2 కోసం ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో సంజ‌య్ దత్‌, ర‌వీనా టాండ‌న్ వంటి పేరున్న స్టార్స్‌ నటించడం విశేషం. ఈ క్ర‌మంలోనే కేజీఎఫ్2 చిత్రం నుండి విడుద‌లైన టీజ‌ర్ యూట్యూబ్‌లో 200 మిలియ‌న్ల వ్యూస్‌ను సాధించి మోస్ట్ వ్యూవుడ్ టీజ‌ర్‌గా రికార్డు సృష్టించింది.