ఫిబ్రవరిలో బిగ్‌బాస్‌-6..ఈసారి హోస్ట్‌ ఎవరో తెలుసా?

Star hero to host Bigg Boss? .. Side Nagarjuna!

0
102

బిగ్‌బాస్‌ 5 ముగిసింది. ఇక ఇప్పుడు అందరూ బిగ్ బాస్-6 గురించి ఎదురుచూస్తున్నారు. వీలైనంత తొందరగా సీజన్ రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అయితే నెక్స్ట్‌ సీజన్‌ అతి తొందరలోనే రాబోతుంది. మరో రెండు నెలల్లో బిగ్‌బాస్‌ తర్వాతి సీజన్‌ రాబోతుందని నాగార్జున ప్రకటించాడు. కానీ అది ఆరవ సీజనా? లేదా బిగ్‌బాస్‌ ఓటీటీ మొదటి సీజనా? అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అలాగే హోస్ట్ ఎవరు చేస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సోషల్‌ మీడియాలో మాత్రం అది ఓటీటీ సీజన్‌ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో దీనికి ఎవరు హోస్టింగ్‌ చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. బిగ్‌బాస్‌ తొలి సీజన్‌కు ఎన్టీఆర్‌, రెండో సీజన్‌కు నాని, మూడు, నాలుగు, ఐదో సీజన్లకు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆరో సీజన్‌కు మాత్రం నాగ్‌ను తప్పించి మరో స్టార్‌ హీరోను రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తుంది!

ఆ స్టార్‌ హీరో మరెవరో కాదు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఆహాలో అన్‌స్టాపబుల్‌ షోలో హోస్ట్‌గా రఫ్ఫాడిస్తున్నాడు బాలయ్య. దీంతో ఈ రియాలిటీ షోను బాలయ్యకు అప్పగిస్తే హోస్టింగ్‌, ఎంటర్‌టైనింగ్‌ వేరే లెవల్‌ ఉంటుందంటున్నారు నెటిజన్లు. కానీ నాగార్జునను కాదని బాలయ్యను వ్యాఖ్యాతగా తీసుకువచ్చే ఛాన్సే లేదన్న అభిప్రాయం కూడా ఉంది. ఒకవేళ నాగార్జున షూటింగ్‌లతో బిజీబిజీగా ఉండి బిగ్‌బాస్‌ బాధ్యతను భుజానికెత్తుకోకపోతే మాత్రం బాలయ్యను రంగంలోకి దింపే అవకాశం లేకపోలేదు. బిగ్‌బాస్‌-6 షో హోస్ట్‌ ఎవరన్నది తెలియాలంటే మరో రెండు నెలలు ఆగాల్సిందే.