తెలుగులో బిగ్ బాస్ ఎంత సక్సెస్ అయిందో తెలిసిందే, అయితే బిగ్ బాస్ షో ని హోస్ట్ చేసిన వారి వల్ల కూడా దానికి మరింత క్రేజ్ వచ్చింది అని చెప్పాలి, అయితే కంటెస్టెంట్సని నొప్పించకుండా వారి అభిమానులకి నచ్చేలా హోస్ట్ చేయడం అంటే కత్తిమీద సాములాంటిది అనే చెప్పాలి.
అయితే తెలుగులో బిగ్ బాస్ వన్ సీజన్ ఎన్టీఆర్ హోస్ట్ చేశారు, ఇక సెకండ్ సీజన్ నాని హోస్ట్ చేశారు, ఇక మూడవ సీజన్ నాగార్జున హోస్ట్ చేశారు, అయితే ఇప్పుడు నాల్గో సీజన్ కూడా నాగార్జున హోస్ట్ చేస్తున్నారు.
అయితే వీరిలో ఎవరి షో ఎక్కువ టీ ఆర్పీ తీసుకువచ్చింది అంటే లెక్కలు ఉన్నాయి, మరి అవి చూద్దాం
70 రోజుల పాటు 14 మంది సెలబ్రిటీలతో జరిగింది బిగ్ బాస్ సీజన్ 1, ఇక సీజన్ 2ని 115 రోజులు నడిపించారు.
బిగ్ బాస్ సీజన్ 1 షో ఓపెనింగ్ రోజు 16.18
రెండో సీజన్ తొలిరోజు రోజు 15.05
మూడో సీజన్లో తొలిరోజు 17.9 రేటింగ్తో రికార్డ్ క్రియేట్ చేసింది.