106 రోజుల గేమ్ షో
15 వారాల టాస్కులు
19 మంది కంటెస్టెంట్లు
హోస్ట్ నాగార్జున
భారీ ప్రమోషన్లు
వీక్లీ సెలబ్రెటీలు
డిఫరెంట్ టాస్కులు
20 రోజులు క్వారంటైన్
ఇలా బిగ్ బాస్ సీజన్ 4 గురించి చెబితే ఎంత చెప్పినా తక్కువే, గత మూడు సీజన్లను మించి సీజన్ 4 సాగింది అని చెప్పాలి.. అయితే ఖర్చు కూడా ఓ రేంజ్ లో పెట్టారు, దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసి అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేశారు, ఇక కంటెస్టెంట్లకు భారీ రెమ్యుననేషన్లు ఇచ్చారు.
వీక్లీ సందడి కి హోస్ట్ నాగార్జున రెమ్యునరేషన్ ఇలాచెప్పుకుంటూ పోతే వంద కోట్ల పైనే మార్కెట్ జరిగింది, అయితే ఎంట్రీ రోజు దాదాపు 2 కోట్ల వరకూ ఖర్చు అయింది అని వార్తలు వచ్చాయి.. ఇక ఫినాలే రోజు కూడా భారీగానే ఖర్చు అయిందట.. దాదాపు నాలుగున్నర కోట్ల వరకూ ఖర్చయి ఉంటుంది అని బుల్లితెర వర్గాలు చర్చించుకుంటున్నాయి.