బిగ్ బాస్ సీజన్ 4 నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు, అయితే ఈ వారం ఆయన వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం ఇప్పటికే మనాలి వెళ్లారు, అక్కడరెండు వారాల పాటు షూటింగ్ ఉంటుంది, అయితే డేట్స్ కుదరడంతో అక్కడ క్రూ అంతా ఉండటంతో అక్కడ బిజీగా ఉన్నారు నాగార్జున, అయితే ఇప్పుడు వీకెండ్ వస్తోంది శని ఆదివారాలు ఆయన బిగ్ బాస్ షోలో రావాలి అంటే ముందు రోజు ఆయన సెట్ కు వచ్చి షూటింగ్ కి వస్తారు.
అంటే శుక్రవారం రావాలి, మరి ఆయన అక్కడ ఉండటంతో తాజాగా ఆయన ప్లేస్ల లోకి హోస్ట్ గా రమ్యకృష్ణ రోజా పేర్లు వినిపించాయి, అయితే తాజాగా టాలీవుడ్ లో మరో వార్త వినిపిస్తోంది, నాగ్ కోసం ఆయన కోడలు హీరోయిన్ సమంత ఆ ప్లేస్ లోకి వస్తున్నారట.
నాగార్జున సలహా మీదే ఆమె హోస్టు చేయడానికి ఓకే చెప్పిందని అంటున్నారు. అయితే సమంత వస్తే అమాంతం టీఆర్పీ కూడా పెరుగుతుంది.. ఇక సమంత ఫ్యాన్స్ కూడా ఈ వార్త విని సంతోషంలో ఉన్నారు, తాజాగా బిగ్ బాస్ విశ్లేషకులు కూడా ఇదే చెబుతున్నారు. మరి చూడాలి బుల్లితెరపై ఎవరు కనిపిస్తారో.