బిగ్ బాస్ 5- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆట సందీప్ పోస్ట్

Bigg Boss 5- Ata Sandeep posting going viral on social media

0
105

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5కు సంబంధించిన ఎన్నో వార్తలు తెగ హల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇక లోగో విడుదల అయిన సమయం నుంచి పెద్ద ఎత్తున దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరే అంటూ అనేక పేర్లు తెగ వైరల్ అవుతున్నాయి. కొందరు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ ఎంట్రీ పై పూర్తిగా క్లారిటీ ఇచ్చేశారు. మేము బిగ్ బాస్ లో పాల్గొనడం లేదు అని తెలిపారు.

ముఖ్యంగా ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి అంటే? యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, శ్వేత, యాంకర్ రవి, నటి ప్రియా, ట్రాన్స్జెండర్ ప్రియాంక, యాంకర్ వర్షిణి, యానీ మాస్టర్, కార్తీక దీపం భాగ్య అలియాస్ ఉమ, నటి లహరి, నవ్వస్వామి, యూట్యూబర్ నిఖిల్, వీజే సన్నీ, ఆర్జే కాజల్, లోబో, మానస్, సిరి హన్మంత్, ఆట సందీప్ భార్య జ్యోతి ఇలా దాదాపు 20 మంది పేర్లు వినిపిస్తున్నాయి.

ఆట సందీప్ దంపతులు ఈ సారి సీజన్ 5 కు వెళ్తున్నారంటూ కొద్ది రోజులుల‌గా టాక్ నడిచింది. తాజాగా సందీప్ చేసిన ట్వీట్ పెను వైరల్ అవుతోంది. ఆట సందీప్ తన ఫేస్ బుక్ స్టోరీలో బిగ్ బాస్ షోకు సంబంధించిన ఓ పోల్ పెట్టారు. మేమిద్దరం బిగ్ బాస్ షోలో ఉండాలని, చూడాలని ఎంతమంది అనుకుంటున్నారు అని పోల్ క్వశ్చన్ పెట్టాడు. 81శాతం మంది పాజిటివ్ గా స్పందించగా, 19 శాతం మంది నో అంటూ స్పందిస్తారు. క్లారిటీ అయితే ఇవ్వలేదు కాని ఆయన హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ లు ఉన్నాయి అంటున్నారు ఫ్యాన్స్.