సరదాగా నవ్విస్తూ అందరితో సరదాగా ఉండే జబర్ధస్త్ అవినాష్ ని ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్లతో పాటు బయట అభిమానులు కూడా బాగా ఆదరిస్తున్నారు, అతని హెల్తీ కామెడికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలా సరదాగా అతను కామెడీ చేస్తున్నాడు, అందరికి అది నచ్చుతోంది.
అయితే అతను ఎంట్రీ ఇచ్చిన సమయంలో జోకర్ అనే కాన్సెప్ట్ తో అద్బుతంగా ఇచ్చాడు, బిగ్ బాస్ 4 ఎంట్రీలో అదే అద్బుతంగా ఉంది అని అందరూ అన్నారు, ఈ సమయంలో తన లవ్ బ్రేకప్ గురించి కాస్త చెప్పాడు, అయితే అతని లవ్ ఏమైంది ఇలా అనేక విషయాలు తెలుసుకోవాలి అని అభిమానులు ఎదురుచూస్తున్నారు, తాజాగా అతని తమ్ముడు అతని లవ్ గురించి తెలిపాడు.అతడి బ్రేకప్ స్టోరీ గురించి అవినాష్ తమ్ముడు అజయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
మేం ముగ్గురం అన్నదమ్ములం, హాస్టల్లో ఉండేవాళ్లం. అవినాష్ అన్నయ్య టెన్త్లో ఉన్నప్పుడు నేను ఐదో తరగతి చదువుతున్నాను. ఆ సమయంలో అన్నయ్మ ఓ అమ్మాయిని లవ్ చేశాడు, స్కూళ్ కి వచ్చాక కూడా ఆమె గురించి ఆలోచన ఆమెని చూసేవాడు, ఇలాంటి సమయంలో అన్నయ్యని డబ్బులు అడిగేవాడిని రూపాయి అడిగితే లేవు అనేవాడు, కాని ఆ అమ్మాయి నన్ను పిలిచి నాకు డబ్బులు ఇచ్చేది.
ఏదైనా అవసరం ఉంటే అన్నయ్య దగ్గరకు వెళ్లేవాడిని కాదు. అక్కా అక్కా అంటూ ఆమె దగ్గరకే వెళ్లి తీసుకునేవాడిని.
కాని ఆ వయసులో నాకు వరుసలు తెలీదు, నేను పదికి వచ్చాక నాకు తెలిసింది అన్నయ్య ఆమెని ప్రేమించాడు అని ,తర్వాత వారిద్దిరిక బ్రేకప్ అయింది కారణం తెలియదు బ్రేకప్ తర్వాత కెరీర్ మీద ఫోకస్ పెట్టాడు. ఇప్పుడు ఈ స్టేజ్ కు వచ్చాడు అని అతను అన్న గురించి తెలిపాడు.