బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో కంటెస్టెంట్లకు సినిమా అవకాశాలు బాగా వస్తున్నాయి.. ఈసారి కంటెస్టెంట్లు అందరూ హౌస్
నుంచి వచ్చిన తర్వాత వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు.. అంతేకాదు బుల్లితెరలో పలు షోలు చేస్తూ బిజీగా ఉన్నారు, ఇక తాజాగా అరియానాకి టాలీవుడ్ లో ఓ మంచి అవకాశం వచ్చింది.. మెగా హీరోతో ఆమె సినిమాలో నటిస్తోంది, మరి ఆ విషయం ఏమిటో చూద్దాం.మెగా హీరో కళ్యాణ్ దేవ్ కొత్త సినిమాలో అరియానా గ్లోరి అవకాశం దక్కించుకుంది, అయితే ఇందులో కల్యాణ్ దేవ్ కు ఆమె సోదరిగా నటించనుంది, స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఆమె ఆట చూసి దర్శకుడు ఆమెకి ఈ అవకాశం ఇచ్చారు.తాజాగా అరియానా గ్లోరీ తాను కళ్యాణ్ దేవ్ సినిమాలో నటిస్తున్నట్లు ఖరారు చేశారు. ఇందులో నా రోల్ చాలా బాగుంది. ఇటీవల షూటింగ్ లో పాల్గొన్నాను అని చెప్పింది అరియానా..నమో వెంకటేశ, దూకుడు సహా చాలా సినిమాలకు ఈ దర్శకుడు రచయితగా పని చేశారు.. ఇక దర్శకుడిగా ఓ మంచి కథ రాసుకుని ఈ చిత్రంలో వస్తున్నారు..మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు అయిన కళ్యాణ్ దేవ్ విజేత సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
|
|
|
బిగ్ బాస్ బ్యూటీ అరియానాకి మెగా హీరో సినిమాలో ఛాన్స్ – క్లారిటీ ఇచ్చేసింది
-