బిగ్ బాస్ తెలుగు సీజన్ 13 వారంలోకి వచ్చేసింది.. ఇక కేవలం మిగిలింది ఈ వీక్ తో కలిపి మూడు వారాలు మాత్రమే. ఏడుగురిలో ఫైనల్ కు ఎవరు వెళతారు టైటిల్ విన్నర్ ఎవరు అనేది. మరో 20 రోజుల్లో తేలిపోతుంది, అయితే తాజాగా బిగ్ అప్ డేట్ ఏమిటి అంటే, బిగ్ బాస్ టైమింగ్ మారాయి అని తెలుస్తోంది.
సోమవారం నుంచి శుక్రవారం వరకూ రాత్రి 9.30 నిమిషాలకు, తిరిగి శని-ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 4 ప్రసార సమయాల్లోచేంజ్ వచ్చింది, వదినమ్మ సీరియల్ కోసం టైమింగ్ మార్చారు. డిసెంబర్ 7 నుంచి బిగ్ బాస్ షో సోమవారం నుంచి శుక్రవారం వరకూ రాత్రి 10 గంటలకు ప్రసారం కానుంది. 10 నుంచి 11 వరకూ బిగ్ బాస్ షో ప్రసారం కానుంది.
ఇక ఆదివారం శనివారం సాధారణ సమయానికి వస్తుంది, బిగ్ బాస్ షో టైంలో వదినమ్మ సీరియల్ రాత్రి 9.30 గంటలకు ప్రసారం కాబోతుంది, ఇక ఈ సీరియల్ పూర్తి అయ్యాక బిగ్ బాస్ వస్తుంది, వదినమ్మ సీరియల్ వచ్చే సమయంలో రాత్రి 7 గంటలకు గుప్పెడంత మనసు అనే కొత్త సీరియల్ ప్రసారం కాబోతుంది. సో చివరి వారాలు కాబట్టి తాజాగా ఈ ఛేంజ్ చేసినా ప్రేక్షకులు చూస్తారు అని టీమ్ భావిస్తోంది.