ఈ రోజు నుంచే ‘బిగ్ బాస్’..చివరి నిమిషంలో కంటెస్టెంట్ల మార్పు!

0
107

బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతగా పాపులర్ అయిందో తెలిసిన విషయమే.  ఎంతోమంది సెలబ్రిటీలను 90 రోజుల పాటు బయట ప్రపంచానికి దూరంగా బిగ్ బాస్ ఇంట్లో ఉంచి టాస్క్ లతో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు. ఇక తాజాగా Biggboss-6 సీజన్ ఇవాళ గ్రాండ్ గా స్టార్ట్ కానుంది.

ఎప్పటిలాగే ఈసారి కూడా బిగ్ బాస్ 6 సీజన్ కి హోస్టుగా నాగార్జున చేయబోతున్నారు. ఈ సీజన్లో ఈసారి 17 మందిని ఫైనల్ చేశారట బిగ్ బాస్. అందులో 15 మందిని ఒకేసారి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించనుండగా మిగతా ఇద్దరి కంటెంట్లను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ప్రవేశ పెట్టబోతున్నట్లు సమాచారం.

ఇక ఎవరెవరు కంటెస్టెంట్ గా ఉన్నారు అనే విషయానికి వస్తే ఉదయభాను.. నటుడు బాలాదిత్య ,సుదీప పింకీ, నేహా చౌదరి , ఆదిరెడ్డి, ఇనయా సుల్తానా, వర్షిని, సింగర్ రేవంత్, చలాకి చంటి, నందు, శ్రీహాన్ సింగర్ మోహన భోగరాజు, యాంకర్ ప్రత్యూష, కొరియోగ్రాఫర్ పప్పీ మాస్టర్ , సంజనా చౌదరి , జబర్దస్త్ అప్పారావు, గీతూ రాయల్, మెరీనా, కీర్తి, ఫైమా వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. ఎలాగో ఈరోజు సాయంత్రం బిగ్ బాస్ సీజన్ 6 ప్రసారం కానున్న నేపథ్యంలో ఎవరెవరు ఎంట్రీ ఇవ్వనున్నారు సాయంత్రం 6 గంటలకు తెలిసిపోతుంది.