బిగ్ బాస్ ఫెమ్ ఇంట విషాదం..కన్నీళ్లు పెట్టిస్తున్న పోస్ట్

0
77

బిగ్ బాస్ తో పాపులర్ అయిన మెహబూబ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తన తల్లి గత నెలలోనే గుండెపోటుతో చనిపోయిందని చెప్పుకొచ్చాడు. జులై 5వ తేదీ తన జీవితాన్ని మార్చేసిందని తెలిపాడు.

తన తల్లి మృతి పై ఎమోషనల్ అవుతూ.. సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. తన తల్లి సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్న ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు మెహబూబ్.” అమ్మ నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయావు. ఇకపై నేను ఎవరితో మాట్లాడాలి?. ఎవరిని అడిగి నిర్ణయాలు తీసుకోవాలి. నీవు లేకుండా నేను ఎలా బ్రతకగలను.

నువ్వు నన్ను ఎప్పుడు కూడా ఏ దానికి కూడా అడ్డుపడలేదు. నా ఎదుగుదలను చూస్తూ మురిసిపోయావు అమ్మ. నా గెలుపోటముల్లొ నువ్వు అండగా ఉన్నావు అమ్మ. నువ్వు ఎక్కడ ఉన్నా సరే నన్ను గమనిస్తుంటావని నాకు తెలుసమ్మా. నువ్వు గర్వపడేలా చేస్తాను అమ్మ. తమ్ముడు శుభాన్, డాడీలను జాగ్రత్తగా చూసుకుంటానమ్మా, మాటిస్తున్నాను అమ్మ”. అంటూ మెహబూబ్ భావోద్వేగ పోస్టును షేర్ చేశాడు.