బిగ్ బాస్ 4 హోస్ట్ గా ఆ స్టార్ హీరోనే ఫిక్స్

బిగ్ బాస్ 4 హోస్ట్ గా ఆ స్టార్ హీరోనే ఫిక్స్

0
92

బుల్లితెరలో ప్రసారమయ్యే అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్…. తెలుగులో ఈ షో అంత ప్రాధాన్యత ఉండదని మొదట్లో అందరు భావించారు… ఫస్ట్ షోకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు… ఈ షో ప్రారంభం అయిన నాటినుంచి చివరివరకు అద్బుతమైన రేటింగ్స్ వచ్చాయి…..

ఇక బిగ్ బాస్ 2 సీజన్ కు నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు ఈ సీజన్ కాస్త డల్ అయినప్పటికీ సీజన్ 3 ని కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించి కింగ్ చేశాడు… ఇప్పుడు మరి కొన్నినెలల్లో బిగ్ బాస్ సీజన్ 4 స్టార్ట్ కానుంది… ఈ నేపథ్యంలోనే ఈ షోకు హోస్ట్ గా ఎవరిని నియమిస్తారనే చర్చ సాగుతోంది…

ఇప్పటికే సోషల్ మీడియాలో సీజన్ 4కు సంబంధించిన వార్తలు కూడా వస్తున్నాయి… నెక్ట్స్ హోస్ట్ గా చిరంజీవి వ్యవహరిస్తారని వార్తలు వస్తున్నాయి… మరికొందరు విక్టర్ వెంకటేష్ లేదంటే రవితేజ హోస్ట్ గా వస్తారని ప్రచారం సాగుతుందో… అయితే తాజాగా సమాచారం ప్రకారం సీజన్ 4 కు సూపర్ స్టార్ మహేష్ బాబు వస్తారని తెలుస్తోంది…

మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తిలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే… కాగా ఇటీవలే ఆయన నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు… ఈ చిత్రం సంక్రాంతి పండుగకు కానుక విడుదలై బాక్సాఫిస్ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే..