బిగ్ బాస్4 తెలుగు కంటెస్టెంట్స్ ఎవ‌రు?

బిగ్ బాస్4 తెలుగు కంటెస్టెంట్స్ ఎవ‌రు?

0
109

బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ అస‌లు ఉంటుందా ఉండ‌దా అని అంద‌రూ తెగ ఆలోచ‌న చేస్తున్నారు.. ఎందుకు అంటే మ‌రో నెల రోజుల్లో అది స్టార్ట్ అవ్వాలి….సో క‌చ్చితంగా బిగ్ బాస్ తెలుగు 4 గురించి అంద‌రూ ఎదురుచూస్తున్నారు, అయితే ఈ వైర‌స్ వేళ ఇక బిగ్ బాస్ ఈ ఏడాది ఉండ‌దని కొంద‌రు భావించారు.. కాని ఈసారి సీజ‌న్ ఉంటుంది అనే చెబుతున్నారు.

అన్నీ టెస్టులు జాగ్రత్త‌లు తీసుకుని ఈ రియాలిటీ షో స్టార్ట్ చేస్తారు అని తెలుస్తోంది, అయితే తెలుగులో ఈ సారి హోస్ట్ విష‌యంలో ప్రిన్స్ పేరు వినిపిస్తోంది, అలాగే తార‌క్ నాగ్ పేర్లు వినిపిస్తున్నాయి, కాని వీరిలో ఎవ‌రు ఫైన‌ల్ అవుతారో తెలియ‌డం లేదు.

ఇక కంటెస్టెంట్స్ విష‌యానికి వ‌స్తే టాలీవుడ్ లవర్ బాయ్ తరుణ్‌, వర్షిణి, మంగ్లీ, అఖిల్ సర్తాక్ తదితరులు ఉంటారని తెలుస్తోంది.. అయితే ఈసారి కూడా హైద‌రాబాద్ అన్నపూర్ణ స్టూడియోలోనే సీజన్ 4 కూడా జ‌రుగుతుంది అంటున్నారు, అయితే సెట్స్ విష‌యాలు ఇంకా బ‌య‌ట‌కు మాత్రం రావ‌డం లేదు. సో చూడాలి వ‌చ్చే రోజుల్లో అంతా క్లారిటీ ఇవ్వ‌నుంద‌ట బిగ్ బాస్ టీం.