బిగ్ బాస్ ను ఐపీఎల్ దెబ్బకొట్టనుందా….

బిగ్ బాస్ ను ఐపీఎల్ దెబ్బకొట్టనుందా....

0
89

బుల్లితెరలో అతిపెద్ద రియాల్టీ షోగా పేరుతెచ్చుకుంది బిగ్ బాస్.. తెలుగులో ఇప్పటికే మూడు షోలను సక్సెస్ ఫుల్ గా రన్ చేసింది.. ఇప్పుడు సీజన్ 4 ప్రారంభం అయింది… అక్కినేని నాగార్జున హోస్ట్ గా 16 మంది సభ్యులతో కరోనా జాగ్రత్తలను తీసుకుంటూ ఈ సీజన్ ప్రారంభించారు…

అయితే ఇప్పటివరకు మూడు సీజన్లు సక్సెస్ ఫుల్ అయ్యాయి కానీ సీజన్ 4కు ఐపీఎల్ ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు… బిగ్ బాస్ 4 సెప్టెంబర్ 6న ప్రారంభం అయింది… ఇక ఈనెల 19 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది… అంటే ఈ రెండింటికి తేడా 13 రోజులు మాత్రమే…

రెండు ఎంటర్ టైన్ మెంట్ షోలు దాదాపు ఒకే సమయంలో జరిగే అవకాశం ఉండటంతో వ్యూయర్ షిప్ పరంగా బిగ్ బాస్ కు ఇది దెబ్బనే అంటున్నారు… భారత కాలమానం ప్రకారం… మ్యాచ్ 3.30కి స్టార్ అవుతుంది… రెండో మ్యాచ్ 7.30కి స్టార్ట్ అవుతుంది… ఇక్కడ రెండో మ్యాచ్ తోనే బిగ్ బాస్ కు ఇబ్బంది… క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి బిగ్ బాస్ షో వ్యూయర్ షిప్ ను కల్పోయే అవకాశం ఉందని అంటున్నారు…