బిగ్ బాస్ సీజ‌న్ 5 ఆ ఇద్ద‌రు కంటెస్టెంట్ల‌ని ఆడుకుంటున్న – నెటిజ‌న్లు ట్రోల‌ర్స్

Bigg Boss Season 5 Netizens trolling the two contestants

0
83

బిగ్ బాస్ షో మొద‌లైంది ఇక సీజ‌న్ 5లో మొత్తం 19 మంది కంటెస్టెంట్ల‌ని హౌస్ లోకి పంపించారు. ఈసారి కూడా కొంత మంది తెలియని వారిని హౌస్ లోకి తీసుకువ‌చ్చారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ల గురించి అనేక వార్త‌లు వస్తాయి అనేది తెలిసిందే. వారికి బ‌య‌ట నుంచి మ‌ద్ద‌తు ఇచ్చేవారు కూడా ఉంటారు. వారు ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా సోషల్ మీడియాలో లెక్కలేనన్ని ట్రోల్స్, మీమ్స్‌తో మీమ‌ర్స్ ర‌చ్చ చేస్తారు.

ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ల‌కు ఆర్మీలు ఫ్యాన్ పేజీలను లాంచ్ చేస్తుంటారు. వారి గురించి పోస్టులు పెట్టి స‌పోర్ట్ చేయ‌మంటారు. అయితే తొలిరోజు ఆరంభం నుంచి మీమ‌ర్స్ కంటెస్టంట్ల‌ని బాగా అబ్జ‌ర్వ్ చేశారు. కొంత మంది మాత్రం బాగానే హైలెట్ అయ్యారు.
షన్ను, మానస్, శ్రీరామ్ చంద్ర వీరు ముగ్గురు చాలా కామ్ గాఉన్నారు.

ఇక సిరి అలాగే స‌న్నీని మీమ‌ర్స్ ట్రోల‌ర్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. సిరి ఓవ‌ర్ ఎమోష‌న్ అవుతోంది అని అంటున్నారు.
ఇక సన్నికి పులిహోర రాజా అనే టైటిల్ బాగానే సరిపోయేట్టుంది అంటున్నారు. మొత్తానికి తొలి రోజు నుంచి నెటిజ‌న్లు ట్రోలింగ్ అయితే స్టార్ట్ చేశారు.