బిగ్ బాస్ సీజన్ 5 మరో వారంలో సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కాబోతోంది. అయితే ఈసారి కంటెస్టెంట్లు ఎవరెవరు హౌస్ లోకి వెళ్లబోతున్నారు అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇక బిగ్ బాస్ లవర్స్ ఈసారి సీజన్ ఎలా నడుస్తుంది. అసలు ఈసారి సెలబ్రెటీలు ఎవరు వస్తారని చూస్తున్నారు. అయితే ఎప్పుడూ సింగర్స్ యాంకర్స్ ని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకుంటారు.
బిగ్ బాస్ సీజన్ లో ఇండియన్ ఐడల్ విజేత శ్రీరామ్ చంద్ర ఓ కంటెస్టెంట్ గా ఉండబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హౌస్ సెట్టింగ్ కూడా పూర్తయిపోయింది. ఇక కంటెస్టెంట్లు కూడా క్వారంటైన్ లో ఉన్నారు. ఇక నాగ్ కూడా హోస్ట్ గా రెడీ అయ్యారు. సో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి ఓసారి వైరల్ అవుతున్నవారి పేర్లు చూస్తే.
విశ్వ, కొరియోగ్రాఫర్ నటరాజ్, సరయు, యానీ మాస్టర్, రవి, లోబో, మానస్, వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, ట్రాన్స్ జండర్ ప్రియాంక, ఉమా దేవి, వర్షిణి, లహరి శ్రీ, ఆర్జే కాజల్ వారి పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా శ్రీరామ చంద్ర పేరు తెరపైకి వచ్చింది. ఈసారి కూడా ఇద్దరు సింగర్స్ ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. శ్రీరామ చంద్ర ఉంటారని టాక్ నడుస్తోంది. ఆయన నుంచి మాత్రం దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. 2010లో ఇండియన్ ఐడల్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దీనిపై క్లారిటీ రావాలంటే సెప్టెంబర్ 5 వరకూ చూడాల్సిందే.