కరోనా విషయంలో ఏపీ తెలంగాణలో సినిమా ప్రముఖులు ఈ వైరస్ కట్టడి కోసం తమకు తోచిన సాయం చేస్తున్నారు.. వారి ఔదార్యం చాటుతున్నారు.. పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే నితిన్ 20 లక్షలు ఏపీకి తెలంగాణకు అందించారు.
ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీకి తెలంగాణకు కోటి రూపాయలు అందించారు, అలాగే ప్రధానికి మరో కోటి రూపాయలు ఇస్తాను అన్నారు, ఇక ప్రిన్స్ మహేష్ బాబు ఏపీకి తెలంగాణకు చెరో 50 లక్షలు ఇవ్వనున్నారు.
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి రూ.70లక్షల రూపాయలు అందించనున్నారు..ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ఇరు రాష్ట్రాలకు చెరో రూ.10లక్షలు అలాగే దర్శకుడు త్రివిక్రమ్ ఇరు రాష్ట్రాలకు చెరో రూ.10లక్షలు, ..అనిల్ రావిపూడి ఇరు రాష్ట్రాలకు చెరో రూ.5లక్షలు అందించారు, ఈ సమయంలో మెగాస్టార్ చిరంజీవి భారీ సాయం ప్రకటించారు, సినిమా కార్మికుల కోసం చిరంజీవి 1 కోటి రూపాయలు ఇవ్వబోతున్నారు.