బిగ్ హీరోతో శేఖర్ కమ్ముల మరో కొత్త సినిమా

బిగ్ హీరోతో శేఖర్ కమ్ముల మరో కొత్త సినిమా

0
87

సెన్సిబుల్ చిత్రాలను తీయడంలో దర్శకుడు శేఖర్ కమ్ముల ముందు ఉంటారు, ఆయన తీసే సినిమాలు చాలా విభిన్నంగా కొత్త కధతో ఉంటాయి, అందుకే ఆయన చిత్రాలకు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా వస్తారు.
ఫిదా అనే చిత్రంతో అందరిని ఫిదా చేశాడు. ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ‘లవ్ స్టోరీ చిత్రంతో బిజీగా ఉన్నాడు.

అయితే ఈ సినిమా తర్వాత మరో క్రేజీ సినిమా ఒకే చేసుకున్నారు ఆయన. తాజాగా ప్రొడ్యూసర్ నారాయణ్ దాస్ నారంగ్ తమ తరవాత సినిమా కూడా శేఖర్ ను చేయమని కోరగానే.. ఆయన వెంటనే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అయితే ఈ సినిమాలో హీరో వెంకటేష్ అని తెలుస్తోంది, మంచి కధ ఉండటంతో ఆయన ఈ సినిమా చేయనున్నారట.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్ పై నారాయణ్ దాస్ నారాంగ్ నిర్మించనున్నారు. ఇక నారప్ప తర్వాత ఈ సినిమా స్టార్ట్ అవుతుందా ఇంకా సమయం పడుతుందా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.