బిగ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్న దర్శకుడు శంకర్

బిగ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్న దర్శకుడు శంకర్

0
108

సౌత్ ఇండియాలో అగ్రదర్శకులలో తమిళ దర్శకుడు శంకర్ కు ఎంతో మంచి పేరు ఉంది, అంతేకాదు ఆయన సినిమాలు కూడా దేశ వ్యాప్తంగా అన్నీ భాషల్లో రిలీజ్ అవుతాయి, మంచి కాన్సెప్ట్ థీమ్ ఆయన చిత్రాల్లో కనిపిస్తుంది. ఆయనతో సినిమా అంటే నిర్మాతలకు పండుగ. మంచి వసూళ్లు కూడా వస్తాయి.

ప్రస్తుతం కమలహాసన్ తో ఇండియన్ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు శంకర్. అయితే తాజాగా ఆయన క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి పాన్ ఇండియా చిత్రాన్ని తీయాలి అని చూస్తున్నారట. అయితే ఇందులో పలువురు స్టార్ హీరోలని తీసుకుంటారు అని వార్తలు వస్తున్నాయి.

కన్నడ నుంచి కేజీఎఫ్ ఫేమ్ యశ్
విజయ్ సేతుపతి
మళయాలం నుంచి ఓ హీరోని తీసుకోవాలి అని చూస్తున్నారట, త్వరలో దీనిపై ప్రకటన వస్తుంది అని చర్చించుకుంటున్నారు కోలీవుడ్ లో.