బిగ్ బాస్ త్రీ లోకి బిగ్ బాస్ 2 కంటెస్టెంట్స్..!!

బిగ్ బాస్ త్రీ లోకి బిగ్ బాస్ 2 కంటెస్టెంట్స్..!!

0
92

బిగ్ బాస్ త్రీ ఇప్పుడిప్పుడే రసవత్త్రంగా మారింది.. నిన్న రాహుల్ రీ ఎంట్రీ తరవాత ఈ షో మరింత రంజుగా తయారయింది.. తెలుగులో ఈ షో ఇప్పటికే పదవ వారానికి చేరుకోగా. ఈ వారం ఎలిమినేషన్ లో శ్రీముఖి, బాబా మాస్టర్, వరుణ్, రవి ఉన్నారు. మరోవైపు కమల్ హాసన్ హోస్ట్‌గా తమిళంలో బిగ్ బాస్ సీజన్ 3 కార్యక్రమం సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న సంగతి తెలిసిందే.

మరో 8 రోజులలో ఈ కార్యక్రమంకి ఎండ్ కార్డ్ పడనుంది. దీంతో కార్యక్రమంపై మరింత ఆసక్తి కలిగేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఈ రోజు బిగ్ బాస్ హౌజ్‌లోకి సీజన్ 2 కంటెస్టెంట్స్ మహత్ మరియు యషిక ఎంటర్ అయినట్టు ప్రోమో వీడియోలో చూపించారు.

వారిద్దరు ఇంటి సభ్యులతో కలిసి కొద్ది సేపు చర్చించి వెళ్ళేముందు ఫినాలేకి చేరుకునే పోటీదారులకి అభినందనలు తెలిపారు. మొదటి రెండు సీజన్స్ మాదిరిగానే సీజన్ 3 కూడా ఎంతో రసవత్తరంగా సాగుతుండగా, ఈ సీజన్ విజేత ఎవరనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.