బిగ్ బాస్ అఖిల్ సీక్రెట్ రూమ్ – అభికి అనుమానం వచ్చింది

బిగ్ బాస్ అఖిల్ సీక్రెట్ రూమ్ - అభికి అనుమానం వచ్చింది

0
121

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో మొత్తానికి సీక్రెట్ రూమ్ గురించి ఎప్పుడు బిగ్ మాస్ మాట్లాడుతారు అని అందరూ భావించారు… మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో సీక్రెట్ రూమ్ గురించి చెప్పేశారు, స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అందరికి అనిపించిన అఖిల్ ని ఇంటి నుంచి బయటకు పంపినట్లు పంపారు, కాని అతన్ని సీక్రెట్ రూమ్ కు పంపారు. అయితే ముందు అందరూ ఇది ఊహించారు ఇది పెద్ద మజాగా ఏమీ జరగలేదు అనే అంటున్నారు అభిమానులు.

సోహైల్, మోనాల్లు వెక్కి వెక్కి ఏడ్చారు. ఇక హౌస్ మేట్స్ ఏమి అనుకుంటున్నారు అనేది మొత్తం అఖిల్ సీక్రెట్ రూమ్ నుంచి చూస్తున్నాడు… ఎవరి ఆట ఏమిటో చూస్తున్నాడు… గతంలో ముమైత్, రాహుల్ని కూడా ఇదే తరహాలో సీక్రెట్ రూంలో పెట్టారు.
అయితే అభిజిత్ మాత్రం ఇది ఫేక్ అని అతను వస్తాడు అని భావిస్తున్నాడు.

సో అతని మైండ్ కి ఇక్కడ పదునుపెట్టాడు, బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్లు సెలక్ట్ చేసి ఎవరిని బయటకు పంపరు అనేది తెలిసిందే.. బిగ్ బాస్ ఇలా సీక్రెట్ రూమ్ టాస్క్ ఇవ్వడంతో చాలా మందికి మనసులో ఉన్నా బయటకు చెప్పడం లేదు, అభి కూడా అదే భావించాడు అఖిల్ సీక్రెట్ రూమ్ లో ఉన్నాడు అని ..