బిగ్ బాస్ అవినాష్ పెళ్లి ఫిక్స్ ? పెళ్లి కూతురు ఆమేనా?

బిగ్ బాస్ అవినాష్ పెళ్లి ఫిక్స్ ? పెళ్లి కూతురు ఆమేనా?

0
94

జబర్ధస్త్ అవినాష్ కాస్త బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత బిగ్ బాస్ అవినాష్ గా మారిపోయాడు… ఇక ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన ఆటతో అందరిని తన అభిమానులుగా మార్చుకున్నాడు… ఇక హౌస్ లో టాస్కుల్లో పెర్ఫామెన్స్ అలాగే కామెడీ చేయడం నటన ఇవన్నీ కూడా అందరికి నచ్చాయి.. ఇక అరియానాతో సరదా మాటలు ఫ్రెండ్ షిప్ ఇవన్నీ ఎమోషనల్ గా కనెక్ట్ చేశాయి అందరిని.

 

జబర్దస్త్ లో అవినాష్ చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును పొందాడు. దీంతో టీమ్ లీడర్గా ప్రమోషన్ను కూడా పొంది.. టాప్ ప్లేస్కు చేరుకున్నాడు. ఇక బిగ్ బాస్ హౌస్ కు వెళ్లిన తర్వాత మరిన్ని షోలు చేస్తూ బిజీగా ఉన్నాడు.. మరి అవినాష్ పెళ్లి ఎప్పుడు అంటే దీని గురించి టాక్ నడుస్తూనే ఉంది.. అతని అభిమానుల కూడా అవినాష్ పెళ్లి ఎప్పుడు అని సోషల్ మీడియాలో తెగ ప్రశ్నిస్తూనే ఉంటారు.

 

అయితే తాజాగా బుల్లితెర వర్గాల టాక్స్ ప్రకారం అవినాష్ కి పెద్దలు సంబంధం చూశారట, ఇక ఆమెది తెలంగాణ అని తెలుస్తోంది. సినిమా రంగానికి బుల్లితెర రంగానికి సంబంధం లేని అమ్మాయి అని వార్తలు వినిపిస్తున్నాయి… అయితే ఇప్పుడు కరోనా ప్రభావం ఉంది కాబట్టి వచ్చే ఏడాది వివాహం చేసుకుంటారు అని వార్తలు వినిపిస్తున్నాయి.