బిగ్ బాస్ హౌస్ లో అఖిల్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా

బిగ్ బాస్ హౌస్ లో అఖిల్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా

0
130

బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5లో ఉండే కంటెస్టెంట్లలో కచ్చితంగా అఖిల్ పేరు వినిపిస్తుంది, ముందు నుంచి తనదైన శైలిలో ఆట ఆడుతున్నాడు నటుడు అఖిల్, స్టైలిష్ లుక్ తో అమ్మాయిల మనసు కూడా దోచాడు, నాలోనే పొంగెను నర్మదా అంటూ గుజరాతీ భామ కోసం అప్పుడప్పుడూ పాట కూడా పాడుతూ ఉంటాడు.

అఖిల్ బిగ్ బాస్ 4ద్వారా చాలా మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. హౌస్ లో అఖిల్ యాటిట్యూడ్ చాలా మందిని ఫిదా చేసిందనే చెప్పాలి. ఏదైనా ఉన్నది ఉన్నట్లు చెబుతాడు, తాను ఏది అనుకుంటే అదే మాట్లాడుతాడు, అతనికి చిన్నతనం నుంచి నటన అంటే ఇష్టం, అలా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టాడు.

తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వెంటనే ఫిట్ నెస్ పై , గ్లామర్ పై ఫోకస్ చేశాడు.బావా మరదలు అనే చిత్రంలో సైతం నటించి తళుక్కుమన్నాడు.. ముత్యాల ముగ్గు -ఎవరే నువ్వు-కళ్యాణి- మోహిని ఇలా పలు సీరియల్స్ లో కూడా అఖిల్ నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. మొత్తానికి హౌస్ నుంచి బయటకు వచ్చాక అఖిల్ కు మంచి సినిమా అవకాశాలు వస్తాయి అంటున్నారు అందరూ. ఇక ఆయనకంటూ సోషల్ మీడియాలో అభిమాన ఘనం ఘనంగానే ఉంది.